newsseals.com

షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన ప్రభాస్

September 9, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : రెబల్ స్టార్ ప్రభాస్ ద‌ర్శ‌క‌డు హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ గురించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం లభించింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతానికి సెప్టెంబర్ 15 వరకు నిలిపి వేయబడింది. రెబల్ స్టార్ ప్రభాస్‌కు సంబంధించి ఈ సినిమాలో ఇంకా కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. షూటింగ్ పెండింగ్ ఉన్నప్పటికీ, సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని భారీ యాక్షన్ బ్లాక్స్ కోసం అమెరికా (US)కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ VFX కంపెనీలు వర్క్ చేస్తున్నాయి.

ఈ పీరియాడిక్ ఎపిక్‌ను గ్రాండ్ విజువల్ వండర్‌గా స్క్రీన్‌పైకి తీసుకు రావడానికి మైత్రి మూవీ మేకర్స్ పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు. గ‌త కొంత కాలంగా ప్ర‌బాస్ కు ఆశించిన మేర స‌క్సెస్ లు రావ‌డం లేదు. సినిమాల ప‌రంగా బారీగా క‌లెక్ష‌న్లు వ‌చ్చినా ఎందుక‌నో త‌ను ఎంచుకోబోయే క‌థ‌లు అలా ఉన్నాయా అని ఫ్యాన్స్ వాపోతున్నారు. మ‌రో వైపు పాన్ ఇండియా స్టార్ గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మూవీ ఆశించిన మేర ఆడ‌లేదు. అది కూడా సేమ్ టాక్సిక్ లాగా మారి పోయింది. ద‌ర్శ‌కుడిని న‌మ్మి సినిమా చేస్తే ప్ర‌భాస్ ఇమేజ్ డ్యామేజ్ చేశాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొత్తంగా ఇప్పుడు ప్ర‌భాస్ కు ఈ ఫౌజీ మూవీ పైనే ఆశ‌లు ఉన్నాయి.

Related News