ఏపీలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు : అనిత


అమ‌రావ‌తి : బంగాళా ఖాతంలో దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వద్ద అల్పపీడనం కేంద్రీకృతం అవ్వడంతో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ (ఐఎండీ) తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత స్పష్టం చేశారు.

ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలో కీల‌క స‌మీక్ష చేప‌ట్టారు. అల్ప పీడ‌నం పరిస్థితిపై ఎప్పటిక‌ప్పుడు సందేశాలు పంపాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. అత్యంత అవ‌స‌ర‌మైతేనే త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని కోరారు. స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు విస్తృతంగా చేప‌ట్టామ‌న్నారు.

  • Related Posts

    చించినడ వంతెన వద్ద భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టాలి

    అమ‌రావ‌తి : ఇటీవల జరిగిన వరుస ఆత్మహత్యల నేపథ్యంలో చించినడ వంతెన వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై చర్చించేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లులో జాతీయ రహదారి, ఆర్ అండ్ బి , హెడ్‌వర్క్స్, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం…

    ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు ప‌రిష్క‌రించాలి

    హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (టీజీఈజేఏసీ) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని క‌లిశారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఆయ‌న‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *