newsseals.com

ఏపీలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు : అనిత

September 11, 2026 · VijayaBhaskar


అమ‌రావ‌తి : బంగాళా ఖాతంలో దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వద్ద అల్పపీడనం కేంద్రీకృతం అవ్వడంతో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ (ఐఎండీ) తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత స్పష్టం చేశారు.

ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలో కీల‌క స‌మీక్ష చేప‌ట్టారు. అల్ప పీడ‌నం పరిస్థితిపై ఎప్పటిక‌ప్పుడు సందేశాలు పంపాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. అత్యంత అవ‌స‌ర‌మైతేనే త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని కోరారు. స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు విస్తృతంగా చేప‌ట్టామ‌న్నారు.

Related News