మరాఠా ఉద్యమకారుడు జరాంగేతో చర్చలు జరపాలి

ముంబై : మరాఠా ఉద్యమకారుడు మనోజ్ జరాంగే చేపట్టిన నిరాహార దీక్ష 14వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో, ఆయనను కలిసి డిమాండ్లను పరిష్కరించాలని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆందోళనలో “బలవంతంగా జోక్యం చేసుకునే” ప్రయత్నాలు చేయవద్దని ఆయన హెచ్చరించారు. జల్నా జిల్లాలోని అంతర్వాలి సరతి గ్రామంలో, 14 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జరాంగేను డిప్కే కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అతని డిమాండ్లను అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం చర్చలు జరపాలి. అతన్ని తాకడానికి కూడా ప్రయత్నించ కూడదు, ఎందుకంటే ఇది మహారాష్ట్ర. దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయ‌ని పేర్కొన్నారు.
ఆత్మహత్య చేసుకున్న MPSC అభ్యర్థి ప్రథమేష్ దేశ్‌ముఖ్ వంటి విద్యార్థుల కోసం మెరుగైన సదుపాయాలు కల్పించాలని జరాంగే కోరుతున్నారని ఆయన చెప్పారు.

ధారాశివ్‌లో దేశ్‌ముఖ్ కుటుంబాన్ని కలిసిన డిప్కే, ప్రథమేష్ వంటి విద్యార్థుల కోసం సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతోనే జరాంగే పోరాడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? వారు తమ పిల్లలను విదేశాల్లో చదివిస్తుంటే, ఇక్కడి పాఠశాలలు మాత్రం నాణ్యంగా లేవు అని డిప్కే ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ మాదిరిగానే, జరాంగేను కూడా 26 రోజుల పాటు ఆకలితో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోందా అని ప్ర‌శ్నించారు. ప్రభుత్వం మనోజ్ జరాంగేను ఇంతకాలం ఆకలితో ఉంచాలనుకుంటోందా? రాజకీయ నాయకులకు హాస్యన టులను కలవడానికి సమయం ఉంది, కానీ జరాంగేతో మాట్లాడటానికి ఎవరూ రావడం లేదు అని ఆయన అన్నారు.

  • Related Posts

    ఏకపక్ష అమెరికా విధానాలకు బ్రిక్స్ ఒక ప్ర‌త్యామ్నాయం

    కేర‌ళ : ట్రంప్ , ఆయన యంత్రాంగం అనేక ఏకపక్ష విధానాలను ముందుకు తీసుకువెళుతున్నందున బ్రిక్స్ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాబట్టి, ఒక రకంగా చెప్పాలంటే బ్రిక్స్ కి ఒక ప్రత్యామ్నాయం. అందుకే మనం బిక్స్ ను బలోపేతం చేయాలి అని…

    సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తేదీల‌తో క్యాలెండ‌ర్

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంక్షేమ పథకాల అమలు తేదీలతో కూడిన క్యాలెండర్‌ను రూపొందించాల‌ని ఆదేశించారు. నేత , హస్తకళల కేంద్రాలను ‘అనుభవ కేంద్రాలు’గా (experience centres) మార్చాలని, కుల వృత్తులకు విలువను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *