ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (టీజీఈజేఏసీ) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఆయనకు వినతిపత్రం సమర్పించారు. టీచర్లు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యంగా పీఆర్సీ , పెండింగ్ డీఏలు, సీపీసీ రద్దు చేయడంతో పాఉట ఓపీఎస్ ని పునరుద్ధరిచాలని కోరారు. పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన ఇతర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలపై వచ్చే సోమవారం జరిగే సమావేశంలో సమగ్రంగా చర్చిస్తామన్నారు. ,పీఆర్సీ, డీఏ, సీపీఎస్ తదితర డిమాండ్ల అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సీఎం ఎ రేవంత్ రెడ్డి . ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల పి. లచ్చి రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.