సంక్రాంతి పండగకు రానున్న చిరంజీవి ‘విశ్వంభర’
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో పడింది. చిత్ర బృందం ప్రస్తుతం మిగిలిన షూటింగ్ భాగాలను పూర్తి చేస్తోంది, చివరి షెడ్యూల్ బుధవారం నాటికి ముగియవచ్చని భావిస్తున్నారు . విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘విశ్వంభర’ సంక్రాంతికి విడుదలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ప్రణాళిక ప్రకారం అంతా సవ్యంగా జరిగితే, జనవరి 12 , 2027వ సంవత్సరంలో తేదీని ఖరారు చేసినట్లు టాక్. ఒక విశ్వసనీయ వర్గం ప్రకారం ఈ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ కుటుంబ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకర్షించగలదని నమ్ముతూ, నిర్మాతలు సంక్రాంతి సెలవుల సీజన్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు.
జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇది ఆరు నుండి 60 ఏళ్ల వయస్సు గల ప్రేక్షకులను ఆకట్టుకోగల చిత్రం, కాబట్టి పండుగ సీజన్ దీనికి ఆదర్శవంతమైన సమయం అని ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మిగిలిన షూటింగ్ భాగాలను పూర్తి చేస్తోంది. ఇటీవల కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు, మొత్తం షూటింగ్ రాబోయే రెండు రోజుల్లో పూర్తి అవుతుందని భావిస్తున్నామని అని ఆ వర్గాలు తెలిపాయి. విఎఫ్ఎక్స్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి, అనుకున్న విడుదల సమయానికి సినిమాను సిద్ధం చేయడానికి చిత్ర బృందం కాలంతో పోటీ పడుతూ పనిచేస్తున్నట్లు సమాచారం. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత అధికారిక విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.