newsseals.com

మాటల్లో కోతలు ఉద్యోగుల వేతనాల్లో కోతలు

September 13, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు తెలంగాణ స‌ర్కార్ నిర్వాకంపై. ర‌రేవంత్ రెడ్డి ప్ర‌జా పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 20–25 ఏళ్లుగా సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం దుర్మార్గం అన్నారు. మున్సిపల్ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జూలై 12న జారీ చేసిన జీవో http://G.O.Rt.No.1181 ఉద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. ఇన్నేళ్లుగా ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా పనిచేస్తున్న ఉద్యోగుల సేవలు, అనుభవాన్ని గుర్తించాల్సింది పోయి.. కొత్త నిబంధనల పేరుతో జీతాలు తగ్గించడం అన్యాయం అన్నారు హ‌రీష్ రావు.

ఈ నిర్ణయం 31 వేల ఉద్యోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
BRS ప్రభుత్వ హయాంలో వేతనాల పెంపు ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేతనాల్లో కోతలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అన్నారు. ఉద్యోగుల పట్ల ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. వేతనాలు తగ్గించడం ప్రజా పాలన కాదు ప్రజా పీడన అవుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే http://G.O.Rt.No.1181ను రద్దు చేయాలని, ఉద్యోగుల పూర్వపు హోదాను యథావిధిగా కొనసాగించాలని కోరారు. ,వేతన రక్షణ కల్పించడంతో పాటు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టుల భర్తీలో అర్హత, సుదీర్ఘ అనుభవం ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు హ‌రీష్‌రావు.

Related News