newsseals.com

బిగ్ బాస్ -10 లో డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్

September 16, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : న‌టుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 10 రియాల్టీ షో జ‌నార‌ణ‌తో దూసుకు వెళుతోంది. ఇప్ప‌టికే ప్రారంభ‌మై వారం గ‌డిచి పోయింది. ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే దానిపై పెద్ద ఎత్తున ఉత్కంఠ నెల‌కొంది ప్రేక్ష‌కుల‌లో. అయితే రాను రాను బిగ్ బాస్ షోలో డ‌బుల్ ఎలిమినేష‌న్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి తాజా స‌మాచారం ప్ర‌కారం రేడియో జాక‌కీ చ‌ర‌ణ్ లేదా చైత్ర రాయ్ మ‌ళ్లీ హౌస్ లోకి ప్ర‌వేస్తారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. బిగ్ బాస్ షోను మ‌రింత ర‌క్తి క‌ట్టించేలా , పాపుల‌ర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇక మ‌రింత జోష్ పెంచేలా ఎప్ప‌టిక‌ప్పుడు దుమ్ము రేపేలా షో న‌డిపిస్తున్నాడు అక్కినేని నాగార్జున‌.

ఇక‌ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం చరణ్ , చైత్ర హౌస్‌లోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు; త్వరలోనే వీరిద్దరికీ ఓటింగ్ లైన్లు తెరుచు కోనున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకూ బిగ్ బాస్ తెలుగు నిర్వాహకులు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. గత వారం జరిగిన డబుల్ ఎలిమినేషన్‌లో RJ చరణ్ , చైత్ర రాయ్ షో నుండి బయటకు వెళ్లారు. అయితే, వీరిద్దరిలో ఒకరికి మాత్రమే తిరిగి వచ్చే అవకాశం లభించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం షో రెండవ వారంలో నడుస్తుండగా, అమన్, నరేష్ , వంశీ మినహా మిగిలిన కంటెస్టెంట్లందరూ ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. మొత్తం మీద బిగ్ బాస్ సూప‌ర్ గా కొన‌సాతుండ‌డం ప‌ట్ల నిర్వాహ‌కులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Related News