newsseals.com

స‌ర్దార్ 2 మూవీపై నెగ‌టివ్ ప్ర‌చారం త‌గ‌దు

September 16, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : ప్రముఖ కోలీవుడ్ నిర్మాత, ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతినిధి జి. ధనుంజయన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఇటీవ‌ల కొన‌సాగుతున్న రివ్యూల ధోర‌ణిపై. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం విడుదలైన ‘సర్దార్ 2’ చిత్రానికి సంబంధించి ఓవర్సీస్ ప్రీమియర్ షోల రివ్యూలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. భారీ నిర్మాణ విలువలతో, తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో కూడిన పర్ఫెక్ట్ కమర్షియల్ సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం బాగుందని ప్రేక్షకులు అంటున్నార‌ని తెలిపారు. కొందరు రివ్యూయర్లు సినిమా విడుదల కాకముందే నెగెటివ్ నరేటివ్‌ను సెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే భారతదేశంలో ఉదయం ఆటలు (9 AM IST) ప్రారంభం కాకముందే, ముందస్తు సోషల్ మీడియా రివ్యూల వల్ల సాధారణ ప్రేక్షకుల మూడ్ దెబ్బ తింటోందని పేర్కొన్నారు జి. ధ‌నుంజ‌య‌న్. ఇది సినిమాను నమ్ముకున్న నిర్మాతలను కోలుకోలేని దెబ్బ తీస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, యూఎస్ (US), మలేషియా, సింగపూర్ వంటి దేశాలలో ముందస్తు ప్రీమియర్ షోలను పూర్తిగా రద్దు చేయాలని ధనుంజయన్ డిమాండ్ చేశారు. సినిమా ఫలితాన్ని తేల్చడానికి ప్రేక్షకులకు కనీసం ఒక రోజు సమయం ఇవ్వాలని, విదేశాల్లోనూ భారతీయ కాలమానం ప్రకారమే ఏకకాలంలో షోలు పడేలా ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ద్వారా గట్టిగా ఒత్తిడి తీసుకు రానున్నట్లు ఆయన చెప్పారు.

Related News