newsseals.com

విజ‌య్ సేతుప‌తి కామెంట్స్ క‌ల‌క‌లం

September 16, 2026 · VijayaBhaskar

చెన్నై : త‌మిళ‌నాడు చ‌ల‌న‌, రాజ‌కీయ రంగాల‌లో ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారాయి ప్ర‌ముఖ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి చేసిన కామెంట్స్. త‌ను ప్ర‌స్తుతం న‌టుడిగానే కాకుండా హొస్ట్ గా కూడా అవ‌తారం ఎత్తాడు. జియో హాట్ స్టార్ తమిళ్ ఛాన‌ల్ లో బిగ్ బాస్ రియాల్టీ షో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందుతోంది. దీనికి విజ‌య్ సేతుప‌తి కూడా కొత్త‌గా అయినా బాగానే నెట్టుకు వ‌స్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో బిగ్ బాస్ వేదిక‌ను ఆస‌రాగా చేసుకుని పొలిటిక‌ల్ లీడ‌ర్లు ఇచ్చిన హామీల‌పై నోరు జారారు.

ఇక విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వివాదానికి దారితీశాయి. అసాధ్యమైన హామీలు ఇవ్వడం త‌ప్పు. సమస్యల నుండి తప్పించు కోవడానికి ప్రతిపక్షాన్ని నిందించడం నాయకుడి లక్షణం కాదు అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా టీవీకే నాయకుడు విజయ్‌ను ఉద్దేశించి చేసినవేనని ఆరోపిస్తూ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో విజయ్ ఇచ్చిన హామీలు , ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని, సేతుపతి ఆ మాటలు అన్నారని భావిస్తూ దీనిపై చర్చ మొదలైంది.

ఈ వివాదం ముదురుతుండటంతో సంబంధిత టీవీ ఛానల్ కూడా ఒక వివరణ ఇచ్చింది. విజయ్ సేతుపతి ఆ వ్యాఖ్యలతో ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొన్న ఛానల్, వాటిని కేవలం బిగ్ బాస్ షోలోని పరిణామాలకు మాత్రమే పరిమితం చేయాలని స్పష్టం చేసింది.

Related News