newsseals.com

సంజు శాంస‌న్ పై గౌత‌మ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్

September 18, 2026 · VijayaBhaskar

ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ , టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో సంజు శాంస‌న్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్. త‌న గురించి శాంస‌న్ ఢిల్లీ వేదిక‌గా చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లో సంజును జట్టు నుండి తొలగించడం అత్యంత కష్టమైన నిర్ణయం అని ఒప్పుకున్నాడు. ఓ న్యూస్ ఛాన‌ల్ తో జ‌రిగిన చిట్ చాట్ సంద‌ర్బంగా గౌత‌మ్ గంభీర్ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌స్తుతం క‌ల‌క‌లం రేపుతోంది. ఆయ‌న చేసిన తాజా కామెంట్స్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సంద‌ర్బంగా మీడియా ప‌ర్స‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు కౌంట‌ర్ ఇచ్చినంత ప‌ని చేశాడు హెడ్ కోచ్. సంజు శాంస‌న్ మీకు క్రెడిట్ ఇచ్చాడు. ముగ్గురిలో ఇద్దరిని ఎంచుకోవడం ఎంత కష్టం అని .

దీనికి సీరియ‌స్ గా సమాధానం ఇచ్చాడు గంభీర్. సంజు సామ్సన్ నాకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేద‌న్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో అతనికి స్థానం సంపాదించి పెట్టడానికి అతని ప్రతిభే చాలు. అతను ఏమి చేయగలడో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ప్రతిభ లేకుండా ఒక ఆటగాడు ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవ్వడని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ నుండి అతన్ని తప్పించడం నా కోచింగ్ కెరీర్‌లో అత్యంత కష్టమైన నిర్ణయం అని అన్నాడు గంభీర్. కానీ కొన్నిసార్లు ఫామ్‌ను బట్టి, మరికొన్నిసార్లు జట్టు కూర్పును బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. ఒకటి రెండు మ్యాచ్‌లలో విఫలమైనంత మాత్రాన ఒక జట్టు లేదా ఆటగాడు చెడ్డవారు అయిపోరని పేర్కొన్నాడు.

Related News