newsseals.com

రేవంత్ రెడ్డి స‌న్నిహితుడు గెస్ట్ హౌస్ కి ర‌మ్మ‌న్నాడు

September 20, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ కు చెందిన మిథున యాడ్స్ కంపెనీ ఓన‌ర్ కె. శోభా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ఆదివారం సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా సీఎం ఎ. రేవంత్ రెడ్డి స‌న్నిహితుడి నిర్వాకం గురించి ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. గత మూడేళ్లుగా అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో పని చేయడానికి చట్టబద్ధమైన, న్యాయమైన అవకాశాన్ని మాత్రమే తాను కోరుతున్నాన‌ని తెలిపింది. ఇటీవల సాధారణ టెండర్లు పిలిచే వరకు తాత్కాలిక అవకాశం కోసం నేను ‘ఆదాయ వాటా’ (revenue-sharing) ప్రతిపాదనలను సమర్పించిన‌ట్లు వెల్ల‌డించింది. అయినప్పటిక నోటీసులు జారీ చేసినా , నిబంధనల అమలుకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకపోయినా కొన్ని ప్రకటనల నిర్మాణాలు (structures) కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు కె. శోభా రెడ్డి. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో పైలట్ ప్రాజెక్టులకు మరియు G.O.Ms.No.68 నిబంధనల నుండి మినహాయింపులు/సడలింపులకు అనుమతులు ఇవ్వబడ్డాయని స్ప‌ష్టం చేసింది.

నన్ను అత్యంత కలవర పెట్టిన విషయం ఏమిటంటే నా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నంలో, మీకు (ముఖ్యమంత్రికి) అత్యంత సన్నిహితులని భావించిన ఒక వ్యక్తిని నేను సంప్రదించానని తెలిపింది. నా సమస్య గురించి చర్చించడానికి ఒక గెస్ట్ హౌస్‌కు రావాలని నన్ను నేరుగా కోరార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అయితే నేను ఎవరి పేర్లనూ ప్రస్తావించదలుచుకోలేదు లేదా బహిరంగ వేదికపై వ్యక్తిగత ఆరోపణలు చేయదలుచుకోలేదు. కానీ చట్టబద్ధమైన వ్యాపార అవకాశాన్ని కోరుకుంటున్న ఒక మహిళా పారిశ్రామికవేత్తగా, ఇటువంటి విషయాలను సరైన, పారదర్శకమైన , గౌరవ ప్రదమైన మార్గాల ద్వారా మాత్రమే పరిష్కరించాలని నేను బలంగా విశ్వసిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేసింది కె. శోభా రెడ్డి.

నేను ఎటువంటి ప్రత్యేక అనుకూలతను కోరడం లేదని పేర్కొంది. కేవలం చట్టబద్ధమైన అవకాశం, సమానమైన వ్యవహరణ , గౌరవాన్ని మాత్రమే ఆశిస్తున్నానని తెలిపింది.

Related News