newsseals.com

రేప‌టి నుండి దేవుని క‌డ‌ప ప‌విత్రోత్స‌వాలు

September 23, 2026 · VijayaBhaskar

తిరుపతి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. క‌డ‌ప‌ జిల్లా దేవుని క‌డ‌ప‌లోని శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ఆల‌యంలో సెప్టెంబ‌రు 24 నుండి 26వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబ‌రు 23న సాయంత్రం పుణ్యాహ వచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వ‌హిస్తారు. సెప్టెంబ‌రు 24న ఉద‌యం చ‌తుష్టార్చాన‌, అగ్ని ప్ర‌తిష్ట‌, ప‌విత్ర ప్ర‌తిష్ట, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు. సెప్టెంబరు 25న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 26న పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.

ఆల‌యంలో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. ఇదిలా ఉండ‌గా శ్రీ దేవుని క‌డ‌ప శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో నిర్వ‌హించే ప‌విత్రోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. భారీ ఎత్తున భ‌క్తులు ఇక్క‌డికి రానున్నారు. ఈ సంద‌ర్బంగా టీటీడీ ఆధ్వ‌ర్యంలో భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై ఫోక‌స్ పెట్టింది.

Related News