బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌కు భారీ స్పందన
హైదరాబాద్ : బతుకమ్మ యంగ్ ఫిల్మ్‌మేకర్స్ ఛాలెంజ్‌కు అఖండ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో, ఉత్సాహవంతులైన చిత్రనిర్మాతల అభ్యర్థన మేరకు, పోటీలో పాల్గొనేందుకు గడువును అక్టోబర్ 2 వరకు పొడిగించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్‌రాజు, ఎఫ్‌డిసి మేనేజింగ్ డైరెక్టర్ ఎం. ముకుందరెడ్డి, ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ కొండారాజు, జ్యూరీ కమిటీ ఛైర్మన్ హరీష్ శంకర్‌ల అధ్యక్షతన ఎఫ్‌డిసి కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
యువతలోని సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించడమే కాకుండా ఉత్సాహ వంతులైన చిత్రని ర్మాతలకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి మరిన్ని అవకాశాలు కల్పించే లక్ష్యంతో గడువును పొడిగించినట్లు వారు తెలిపారు. సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ కల్చరల్ సంస్థ చైర్‌పర్సన్ వెన్నెలకంటి గద్దర్, ఎఫ్‌డీసీ ఈడీ కిశోర్‌బాబు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, విమలక్క, కాసర్ల శ్యామ్, పొన్నమ రవిచంద్ర, అనిల్ జిల్లా, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణకు చెందిన కళాకారులు, కవులు, రచయితలు , వర్ధమాన దర్శకులు, లఘు చిత్రకారులు, డాక్యుమెంటరీలు తీసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు దిల్ రాజు.