రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. జాతీయ అంశాలు, తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరిపారు. ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి ముందు అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతో కీలక చర్చలు జరిపారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, సంస్థాగత వ్యవహారాలు చూస్తున్న కేసీ వేణుగోపాల్ ,కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు, కీలకమైన జాతీయ , సామాజిక-ఆర్థిక అంశాలపై చర్చలు జరిపినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. అంతకు ముందు, AICC ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు , విద్యాశాఖ మంత్రులతో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ , వేణుగోపాల్ సమావేశమయ్యారు.
విద్యా విధానాల అమలు, అక్షరాస్యత రేట్ల పెంపు , విద్యా రంగానికి సంబంధించిన ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి, కేరళకు చెందిన వీడీ సతీశన్ . హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. CWC సమావేశానికి ముందు రాహుల్ గాంధీ, వేణుగోపాల్ , శివకుమార్‌లతో “అర్థవంతమైన చర్చ” జరిపినట్లు రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని చెబుతూనే, జాతీయ అంశాలపై కూడా చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇందులో భాగంగా బీజేపీ , ఎన్నికల సంఘం ఎన్నికల విశ్వసనీయతను దెబ్బ తీస్తున్న తీరు, అలాగే దేశం కోసం సామాజిక-ఆర్థిక వ్యూహాలను రూపొందించాల్సిన ఆవశ్యకత వంటి అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు.