సుందర్ పిచాయ్ అసాధారణమైన వ్యక్తి : ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో టాప్ ఏఐ సంస్థల సీఈఓలతో భేటీ అయ్యారు. వారితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రవాస భారతీయుడైన , అత్యధిక వేతనం తీసుకునే గూగుల్ , ఆల్ఫా బెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆయనను ట్రంప్ ఏకంగా అసాధారణమైన వ్యక్తి అని కొనియాడరు. తాజాగా ట్రంప్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. సోషల్ మీడియాను హల్ చల్ చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ప్రవేశ ద్వారం వద్ద విలేకరులకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ను పరిచయం చేస్తూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. పిచాయ్ అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నారని పేర్కొన్నారు. ఆయనను ఒక “మాన్‌స్టర్” (అసాధారణ శక్తి/వ్యక్తి) అని ట్రంప్ అభివర్ణించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కు సంబంధించిన కొత్త ఒప్పందాలను ప్రకటించేందుకు ట్రంప్ వైట్ హౌస్‌లో ప్రముఖ టెక్ రంగ నాయకులతో సమావేశమయ్యారు. అయితే, భోజన విరామం తర్వాత, AI రంగానికి చెందిన CEOలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా, గూగుల్ CEO సుందర్ పిచాయ్‌ను ఎవరికీ తెలియని ఒక “మాన్‌స్టర్” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్ హౌస్ ప్రవేశద్వారం వద్ద విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు, డొనాల్డ్ ట్రంప్ సుందర్ పిచాయ్‌ను మాట్లాడాల్సిందిగా ఆహ్వానించారు. “సుందర్, నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?” అని ట్రంప్ అడిగారు. దానికి పిచాయ్, “ముందుగా, ధన్యవాదాలు…” అని సమాధానం ఇచ్చారు. కానీ గూగుల్ అధినేత తన మాట పూర్తి చేయకముందే అమెరికా అధ్యక్షుడు ఆయనను మధ్యలోనే ఆపారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ పిచాయ్ గురించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు .