newsseals.com

పీఎం ఇంటర్న్‌షిప్ పథకంపై ఫోక‌స్ పెట్టాలి

October 2, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ‘పీఎం ఇంటర్న్‌షిప్ పథకం’ (PM Internship Scheme)ను సమర్థవంతంగా వినియోగించు కోవాలని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఉండవల్లి లోని త‌న‌ నివాసంలో నైపుణ్యాభివృద్ధి శాఖ (Skill Development Department) ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్బంగా అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలపై స‌మీక్ష చేప‌ట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత మందికి శిక్ష‌ణ ఇచ్చారని ఆరా తీశారు. శిక్ష‌ణ పొందిన వారిలో ఎంత మందికి ఉపాధి క‌ల్పించార‌నే దానిపై పూర్తి వివ‌రాలు ఇవ్వాల‌ని ఆదేశించారు నారా లోకేష్ బాబు.

ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు కూడా చేశారు మంత్రి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా చేపడుతున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాల‌న్నారు. దీని ద్వారా యువతకు భారీ స్థాయిలో ఉపాధి , ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు నారా లోకేష్‌. ఈ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 5.43 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా CEDAP ద్వారా ఏటా లక్ష మంది యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యాన్ని నిర్దేశించు కోవాలని స్ప‌ష్టం చేశారు. నిరంత‌రం స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్య‌క్ర‌మాలు కొన‌సాగాల‌ని పేర్కొన్నారు.

Related News