newsseals.com

సీఈఓల‌తో డొనాల్డ్ ట్రంప్ భేటీ వైర‌ల్

October 3, 2026 · VijayaBhaskar

వాషింగ్ట‌న్ : సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నారు అమెరికా దేశాధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయ‌న ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప్ర‌పంచాన్ని శాసిస్తున్న టెక్నాల‌జీ ప‌రంగా ఆయా టాప్ కంపెనీల‌కు చెందిన చైర్మన్లు, సీఈఓలు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైర‌ల్ అయ్యాయి. ఎక్క‌డ చూసినా ఏ మాధ్య‌మం వెతికినా ట్రంప్, సీఈఓల ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో అధ్యక్షుడు ట్రంప్ కేవలం ఒకే ఒక్క ఫోటో ద్వారా మీరు ఏయే స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలో క్లుప్తంగా తెలియజేశారంటూ మ‌రికొంద‌రు కామెంట్స్ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇదిలా ఉండ‌గా త్వ‌ర‌లో అమెరికాలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో ట్రంప్ మ‌రోసారి గెల‌వాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గ‌త ఎల‌క్ష‌న్స్ లో అమెరికా ఫ‌స్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్లారు. ఇదే ట్యాగ్ లైన్ తో ఆయ‌న అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేశారు. ఇక ట్రంప్ ను క‌లిసిన టాప్ కంపెనీల‌లో ఏఎండీ, టెస్లా, మెటా, మైక్రాన్ , నివిడియా , పాలంటీర్, స్పేస్ ఎక్స్, అమెజాన్ , గూగుల్ , మైక్రోసాఫ్ట్ , స‌ర్వీస్ నౌ, పాలో ఆల్టో నెట్ వ‌ర్క్స్ సంస్థ‌ల‌కు చెందిన సీఈఓలు హాజ‌ర‌య్యారు. త‌మ అనుభ‌వాల‌ను పంచుకున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ తో.

Related News