ఓడ రేవుల అభివృద్దికి స‌హ‌క‌రించండి : సీఎం

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీలో కేంద్ర ఓడరేవులు, నౌకాయాన , జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఓడరేవుల అభివృద్ధి, ముల్లపేట ఓడరేవు వద్ద టెర్మినల్ ఏర్పాటు తో పాటు దుగ్గరాజపట్నంలో నౌకా నిర్మాణ కేంద్రం స్థాపనపై చర్చలు జరిగాయి. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఓడరేవుల ఆధారంగా పారిశ్రామిక , వాణిజ్య అభివృద్ధిని వేగవంతం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.

ఇప్పటికే నిర్మాణంలో ఉన్న , ప్రతిపాదిత ఓడరేవులతో పాటు నౌకా నిర్మాణం, నౌకల మరమ్మత్తు , మెరైన్ ఇంజనీరింగ్ వంటి రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా భారీ స్థాయిలో ఉపాధి, పెట్టుబడి అవకాశాలు లభిస్తాయని నారా చంద్ర‌బాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ముల్లపేట ఓడరేవు అభివృద్ధి ఉత్తరాంధ్రలో వాణిజ్య కార్యకలాపాలకు మరింత ఊతమిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఓడరేవుకు అవసరమైన టెర్మినల్ , అనుబంధ మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుండి తగిన సహకారం అందించాలని కోరారు. ఇదే క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్న 23 వేల ఎక‌రాల‌ను త‌మ రాష్ట్రానికి బ‌ద‌లాయించాల‌ని విన్న‌వించారు ఇదే క్ర‌మంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ సంద‌ర్భంగా.

  • Related Posts

    త‌మిళ‌నాడు ఉప ఎన్నిక‌ల్లో టీవీకే విజ‌యం

    చెన్నై : త‌మిళ‌నాడులో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న టీవీకే పార్టీ స‌త్తా చాటింది. దీంతో సీఎం ప‌నితీరుకు ఇది అద్దం ప‌డుతోంది. రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఈ ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. మధురాంతకం నియోజకవర్గంలో మరకతం కుమారవేల్ 17,554 ఓట్ల…

    సుప్రీం కోర్టు తీర్పును శిరవహిస్తాం : ఎస్. స‌విత

    పెనుకొండ : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. దీనిపై శుక్ర‌వారం ఎస్. స‌విత స్పందించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *