newsseals.com

బండి సంజ‌య్ నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే ఎలా..?

October 9, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : మాజీ తెలంగాణ విద్యా క‌మిష‌న్ చైర్మ‌న్ ఆకునూరి ముర‌ళి నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ చేసిన కామెంట్స్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చనిపోయిన వాళ్ల ఓట్లు తియ్యాల్సిందే.. రోహింగ్యాల ఓట్లు తియ్యాల్సిందే .. ఎవ్వరు వద్దన్నారని ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్ కు ద‌గ్గ‌ర‌లోని మహేశ్వరం లో 30,000 మంది రోహింగ్యాలు ఉన్నారు అంటున్నావు. అంటే మీ దగ్గర హోమ్ శాఖ మంత్రిగా పూర్తి సమాచారం ఉంది కదా.. 12 సం నుండి మీరే కదా పరిపాలన చేస్తున్నారు. మీ శాఖనే కదా బాధ్యత వహించాలి. మరి వాళ్ళను దేశం లోకి ఎట్లా రానిచ్చారని మండిప‌డ్డారు ఆకునూరి ముర‌ళి.

వచ్చినాక ఎందుకు వాళ్ళను బయటకు పంపడం లేదు? ఏది పడితే అది మాట్లాడడం మీకు అలవాటయ్యింది. మీరూ మీ రాజకీయాలు. తెలంగాణ లో 73 లక్షల మంది చనిపోయారా డ్రాఫ్ట్ రోల్స్ లో రాలేదు ? తెలంగాణ లో ఎన్ని లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారు ? దేశం లో 13.39 కోట్ల మంది లో ఎంత మంది చనిపోయారు? ఎన్ని కోట్ల మంది రోహింగ్యాలు? ఇన్ని కోట్ల మంది ఎందుకు లో లేరు ? అంటే వీళ్ళ ఓట్లు తియ్యడానికి జ్ఞానేష్ కుమార్ కు ఎవరు ఇచ్చారు అధికారం అని నిల‌దీశారు. జ్ఞానేష్ కుమార్ CEC ని ఇలా వాడుకోడానికి సిగ్గులేదా ? మళ్లీ మేము విమర్శిస్తే రాజ్యాంగ సంస్థ ను విమర్శిస్తున్నారు అంటారు. మొన్న ప్రస్తుత సుప్రీమ్ కోర్ట్ జస్టిస్ కూడా మిమ్మల్ని బాగానే అర్సుకున్నాడు కదా అంటూ ఎద్దేవా చేశారు.

Related News