రియల్ వాటర్ మ్యాన్ సీబీఎన్ : రామానాయుడు
అమరావతి : రాజకీయాలలో అరుదైన ఘనత సాధించిన ఏకైక నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. 24 గంటలలో 20 గంటలకు పైగా ఆయన రాష్ట్రం అభివృద్ది కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో నీటి వనరులను గుర్తించి వాటిని ప్రజలకు తాగు నీరు, రైతులకు సాగు నీరు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పట్టిసీమతో కృష్ణా డెల్టా రైతులకు సాగు, త్రాగు నీటి భరోసా కల్పించిన దార్శనికుడు సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు నిమ్మల రామానాయుడు కృష్ణా డెల్టా సాగు, త్రాగు నీరు తీర్చడమే కాదు, రాయలసీమ కు భరోసా ఇచ్చింది పట్టిసీమ అని వెల్లడించారు.
ఇప్పటి వరకు 500 టీఎంసీ లు గోదావరి జలాలు ఎత్తిపోసింది పట్టిసీమ అని చెప్పారు నిమ్మల రామానాయుడు. రూ. 1600 కోట్ల తో నిర్మిస్తే 50 వేల కోట్ల సంపద సృష్టించింది పట్టిసీమ అని వెల్లడించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు విజనరీ కి నిదర్శనం పట్టిసీమ అని తెలిపారు నీళ్ల మంత్రి. ప్రత్యేక్షంగా కృష్ణా డెల్టాకు, పరోక్షంగా రాయలసీమ కు పట్టిసీమ ఊపిరి పోసిందని చెప్పారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ అసెంబ్లీ సాక్షిగా పట్టిసీమ దండగ , డబ్బులు వృధా అన్నాడని కానీ తాము వచ్చాక దానిని ఆచరణలో చేసి చూపించామన్నారు. ఎల్ నినో వంటి కరువు పరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలిచిన సంజీవని పట్టిసీమ ఎత్తిపోతల పథకం అని గుర్తు పెట్టుకోవాలన్నారు.