newsseals.com

సోష‌ల్ మీడియాలో శోభిత ధూళిపాళ వైర‌ల్

October 13, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ప‌త్రిక హాలీవుడ్ రిపోర్ట‌ర్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీలో త‌న అందాల‌ను ఆర‌బోసింది న‌టి , నాగ చైత‌న్య భార్య శోభిత ధూళిపాళ‌. భారతీయ నటి, మోడల్ గా గుర్తింపు పొందారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో నటిస్తూ పేరొందారు. గూఢచారి, మేజర్, మేడ్ ఇన్ హెవెన్, పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లతో ప్రసిద్ధి చెందారు. త‌న స్వ‌స్థ‌లం ఏపీ. మే 31, 1992లో తెనాలి న‌గ‌రంలో పుట్టింది. ముంబై విశ్వ విద్యాలయంలో చదువుకున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ భాష‌ల‌లో మంచి ప‌ట్టు క‌లిగి ఉన్నారు. శోభితా మొదట మోడలింగ్, అందాల పోటీల ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మిస్ ఇండియా ఎర్త్ రన్నరప్‌గా నిలిచారు.

అనంతరం అంతర్జాతీయ స్థాయిలో జరిగిన మిస్ ఎర్త్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం రామన్ రాఘవ్ 2.0 ద్వారా నటిగా పరిచయమయ్యారు. 2018లో గూఢ‌చారి మూవీలో కీ రోల్ పోషించారు. అడివి శేష్ హీరోగా నటించిన ఈ స్పై థ్రిల్లర్‌లో సమీరా పాత్ర పోషించారు. తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో ఇది ముఖ్యమైనది. 2022లో వ‌చ్చిన మేజ‌ర్ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రంలో ప్రమోదా రెడ్డి పాత్రలో నటించారు. మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సీరీస్ లో అల‌రించారు శోభిత ధూళిపాళ‌. తారా ఖన్నా పాత్రలో నటించి విశేష గుర్తింపు పొందారు. ఈ వెబ్ సిరీస్ ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పొన్నియిన్ సెల్వన్ 1, 2 లో వాన‌తి పాత్ర‌ను పోషించారు. దేవ్ పటేల్ దర్శకత్వం వహించిన అంతర్జాతీయ యాక్షన్ చిత్రంలో సీత పాత్ర పోషించారు.

Related News