హైదరాబాద్ : విక్టరీ వెంకటేష్ నటించిన, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భాగస్వామ్యంతో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నం. 47’ (Aadarsha Kutumbam House No. 47) . ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచచ్చింది. ఇప్పుడు డిజిటల్ వేదికపైకి రానుంది. భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో శుక్రవారం నుండి అందుబాటులోకి రానుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువయ్యేలా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు.
దీనివల్ల ప్రేక్షకులు తమకు నచ్చిన భాషలో ఈ సినిమాను వీక్షించే అవకాశం కలుగుతుంది. థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయిన ఈ ఫ్యామిలీ డ్రామాకు, ఓటీటీ ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన లభిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించగా, నారా రోహిత్ మరియు సత్య కీలక పాత్రల్లో కనిపించారు. తమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారాంతంలో కుటుంబంతో కలిసి ఇంట్లోనే సరదాగా చూసేందుకు ఈ సినిమా ఒక మంచి ఎంపిక కానుంది. వెంకీ, త్రివిక్రమ్, ఎస్ ఎస్ థమన్ ల అభిమానులకు ఒక పండుగ అని చెప్పక తప్పదు.




