newsseals.com

విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ఆటంకం లేకుండా చూడాలి : భట్టి

October 14, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క రాష్ట్రంలో చోటు చేసుకున్న విద్యుత్ స‌ర‌ఫరా , అంత‌రాయంపై బుధ‌వారం కీల‌క స‌మీక్ష చేప‌ట్టారు. ప్రజా భవన్‌లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా , తీసుకుంటున్న ముందస్తు చర్యలపై ఆరా తీశారు. ‘ఎల్ నినో’ (El Niño) ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున, రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరాను అందించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వ్యవసాయం, గృహాలు ,పరిశ్రమలకు ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడం మా ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.
అవసరమైతే ‘కోల్ ఇండియా’ (Coal India) నుండి అదనపు బొగ్గును కొనుగోలు చేయడానికి నిధుల కొరత లేకుండా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్ర‌క‌టించారు. అలాగే విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశాను. అధికారులు సమన్వయంతో పని చేయాల‌ని, ప్రజలకు నిరంతర విద్యుత్ అందించేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం. మ‌రో వైపు క‌రెంట్ క‌ష్టాల‌తో ప్ర‌జ‌లు, వినియోగ‌దారులు, రైతులు నానా తంటాలు ప‌డుతున్నారు.

Related News