Wednesday, 14 October 2026

ప్రజల విశ్వాసమే కూటమి ప్రభుత్వానికి బలం

newsseals-KolluRavindra

అమ‌రావ‌తి : రాష్ట్ర ఎక్సైజ్, గ‌నుల శాఖ మంత్రి కొల్లు ర‌వీంద్ర నిప్పులు చెరిగారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై. త‌న వ‌ల్ల రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంద‌ని ఆవేద‌న చెందారు. బుధ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన నష్టాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. ఇక‌నైనా బుద్ది మార‌క పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రం ఎంత అస్తవ్యస్తమైందో ప్రజలకు బాగా తెలుసు అన్నారు. 11 సీట్ల‌కే ప‌రిమితం చేసినా త‌న‌లో మార్పు రాలేద‌న్నారు . ఇలాగైతే స్తానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఒక్క సీటు కూడా రాద‌ని ఎద్దేవా చేశారు కొల్లు ర‌వీంద్ర‌. ప్ర‌స్తుతం అభ్యర్థులు కూడా దొరకని దిక్కుతోచని స్థితిలో గొడ్డలి పార్టీ ఉందన్నారు.

94 శాతం స్ట్రైక్‌ రేట్‌తో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అని అన్నారు. రెండేళ్లలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్న‌ట్లు తెలిపారు కొల్లు ర‌వీంద్ర‌. కూటమి పాలనపై ప్రజల్లో సంతృప్తి ఉంద‌ని, ఇక పార్టీ ప‌రంగా ఫుల్ జోష్ క‌నిపిస్తోంద‌ని చెప్పారు. ప్రజలకు కూటమి ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉంద‌న్నారు. రానున్న ఎన్నికల్లో వన్‌సైడ్‌ విజయం సాధిస్తాం అని ధీమా వ్య‌క్తం చేశారు. జగన్‌ పాలనలో జరిగిన నష్టాన్ని ప్రజలు ఇంకా గుర్తుంచుకున్నార‌ని , వారు మ‌రిచి పోలేక పోతున్నార‌ని అన్నారు. ఇక జ‌గ‌న్ రెడ్డికి చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మ‌న్నారు . వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో అన్ని వ్య‌వ‌స్థ‌లు నిర్వీర్యం అయ్యాయ‌ని , వాటిని పూర్వ స్థితిలోకి తీసుకు రావ‌డం కోసం సీఎం చంద్ర‌బాబు నాయుడు రేయింబ‌వ‌ళ్లు ప‌ని చేస్తున్నార‌ని చెప్పారు కొల్లు ర‌వీంద్ర‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *