Thursday, 15 October 2026

కనువిందు చేసిన జాతీయ కళా రూపాలు

newsseals-TTDCulturals

తిరుమ‌ల : తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని అక్టోబ‌ర్ 20వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఈ సంద‌ర్బంగా నిర్వ‌హించిన క‌ళాకారుల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆక‌ట్టుకున్నాయి. తొమ్మిది రాష్ట్రాల నుంచి 16 కళా బృందాలు.. 415 మంది కళాకారుల ప్రదర్శనలు ఇచ్చారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి నిర్వహించిన ముత్యపుపందిరి వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో భక్తులను అలరించారు.

కేరళ, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు చెందిన 16 కళాబృందాల 415 మంది కళాకారులు సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో తిరుమలలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను నింపారు. మయూర నృత్యం, మోహినీయాట్టం, సంబల్‌పురి, మణిపురి, రైబెన్సీ, బిహు నృత్యాలు, డ్రమ్స్ ప్రదర్శనలతో పాటు ‘దేవీ వైభవం’, ‘వేణుగాన విహారి’ నృత్యరూపకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తి, సంప్రదాయం, కళల సమ్మేళనంగా సాగిన ఈ ప్రదర్శనలు భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ వైభవాన్ని చాటి చెప్పాయి. కళాకారుల ప్రదర్శనలను వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి పోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *