newsseals.com

గజ వాహనంపై గోవిందుడి దివ్య కటాక్షం

October 18, 2026 · VijayaBhaskar

తిరుమల : ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రం తిరుమ‌ల భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు గజ వాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ముందుగా గజ రాజులు నడుస్తుండగా, మంగళ వాయిద్యాలు, భక్తుల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ప్రబంధ పారాయణాల నడుమ గజ వాహన సేవ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామ స్మరణతో స్వామి వారిని దర్శించుకున్నారు.

రాజ వైభవానికి, గౌరవ మర్యాదలకు ప్రతీకగా నిలిచే గజ వాహనంపై స్వామి వారి దర్శనం సకల పాపాల నుంచి విముక్తిని ప్రసాదిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. గజ వాహన సేవలో టీటీడీ గజరాజులు సైతం పాల్గొని ఉత్సవ వైభవాన్ని మరింత శోభాయమానం చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా ఉత్స‌వాల‌లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచింది గ‌రుడ సేవ కార్య‌క్ర‌మం. భ‌క్తులు స్వామి ద‌ర్శ‌నం కోసం పోటెత్తారు. విస్తృతంగా ఏర్పాట్లు చేసింది టీటీడీ.

Related News