హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై. సోమవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడం లేదని ఎందుకని ప్రశ్నించారు. కొన్ని నెలల నుంచి రేవంత్ రెడ్డి ఆధారాలు బయట పెడుతున్నాం అయినా స్పందించక పోవడం దారుణమన్నారు. విచిత్రం ఏమిటంటే సమాధానం చెప్పకుండా నిరాధారమైన ఆరోపణలు కేటీఆర్, హరీష్ , కేసీఆర్ లపై చేస్తున్నారని మండిపడ్డారు మన్నె క్రిశాంక్. తెలంగాణలో సీబీఐ రావాలంటే రేవంత్ రెడ్డి అనుమతి ఉండాలన్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కొండల్ రెడ్డి కంపెనీకి భూమి కేటాయించారని, అమెరికాలో రేవంత్ రెడ్డి తమ్ముడి కంపెనీ స్వచ్ఛ్ బయోతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు.
సీఎం భార్య గీతా రెడ్డి హ్యుందాయ్ షో రూమ్‌లు ప్రారంభిస్తున్నారని, కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ అసైన్డ్ భూములు ఉన్నామని దుష్ప్రచారం చేశారని కానీ ఇప్పటి వరకు అవి ఎక్కడున్నాయో ఎందుకని తేల్చలేక పోయారని నిలదీశారు మన్నె క్రిశాంక్. ఎల్‌నినోపై రివ్యూ మీటింగ్ పెట్టుకుని మంత్రులు బర్త్‌డే పార్టీలు చేసుకున్నారని మండిపడ్డారు. అక్టోబర్‌లో రివ్యూ మీటింగ్ పెట్టి రైతులు పంటలు వేయవద్దని చెప్పడం ఎంత వరకు సబబు అని ఫైర్ అయ్యారు. రెండున్నరేళ్లలో రూ. 50 వేల కోట్లు రేవంత్ రెడ్డి కుటుంబం దోచుకుందని ఆరోపించారు. 22A పేరుతో నిషేదిత భూముల దందా చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చిన్న తమ్ముడు కృష్ణారెడ్డి మరో పవర్ సెంటర్ గా మారాడని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను బెదిరించడమే కాకుండా 22A పేరుతో దందాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.




