Monday, 19 October 2026

ఏఎస్ఓ పోస్టుల కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేష‌న్

newsseals-APPSCASO

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు ద‌శ‌ల వారీగా రాష్ట్రంలో వివిధ శాఖ‌ల‌లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసే ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టింది. ఇందులో భాగంగా తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అసిస్టెంట్ స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో 196 పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ విడుదలైంది. అక్టోబ‌ర్ 13 నుంచి ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ స్వీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు చివ‌రి తేదీ వ‌చ్చే నవంబ‌ర్ 2వ తేదీ రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని ఏపీపీఎస్సీ స్ప‌ష్టం చేసింది.

ఇక ఏఎస్ఓ పోస్టుల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు స్టాటిస్టిక్స్ , మ్యాథ‌మెటిక్స్ , ఎక‌నామిక్స్ , కామ‌ర్స్, కంప్యూట‌ర్ సైన్స్ సంబంధిత నిర్దేశిత అర్హ‌త‌ల‌తో బ్యాచిల‌ర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాల‌ని పేర్కొంది. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అభ్య‌ర్థుల వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మ‌ధ్య ఉండాల‌ని, నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయని తెలిపింది. ఏఎస్ఓ పోస్టు కోసం ప్రారంభ వేత‌నం రూ. 50 వేలు ఉంటుంద‌ని, పే స్కేల్ రూ. 37, 640 నుంచి రూ. 1,15,000 వ‌స్తుంద‌ని తెలిపింది ఏపీపీఎస్సీ. ఇక ఎంపిక విధానం పూర్తిగా కంప్యూటర్ ఆధారిత ప‌రీక్ష‌తో పాటు సీపీటీ టెస్టు నిర్వ‌హిస్తామ‌ని పేర్కొంది. రాత ప‌రీక్ష 2 పేప‌ర్లు ఉంటాయ‌ని, మొత్తం 300 ప్ర‌శ్న‌ల‌తో ప్ర‌శ్నా ప‌త్రం ఉంటుంద‌ని వెల్ల‌డించింది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల కోత ఉంటుంద‌ని, ప్రాసెసింగ్ ఫీజు ₹250 + పరీక్ష ఫీజు ₹80. నిబంధనల ప్రకారం కొన్ని వర్గాలకు పరీక్ష ఫీజు మినహాయింపు వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *