newsseals.com

ఏపీలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం : ఎండీ

November 5, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : ముర‌సు తుపాను ప్ర‌భావం కొన‌సాగుతుంద‌ని దీని కార‌ణంగా ఇవాళ ఏపీలోని ప‌లు ప్రాంతాల‌లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించారు ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ఎండీ ప్ర‌ఖ‌ర్ జైన్. ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాల‌ని సూచించారు. విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

భారీ వర్షాలతో వచ్చే ఆకస్మిక వరదల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రించారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, కాలువలు, మునిగి పోయిన కాజ్‌వేలు దాటే ప్రయత్నం చేయరాదని అన్నారు. నిన్న సాయంత్రం 6 గంటల నాటికి ఏలూరు జిల్లా బయ్యనగూడెంలో అత్యధికంగా 182.5 మి.మీ, జీలుగుమిల్లిలో 139.63 మి.మీ., పి.నారాయణపురంలో 128.75 మి.మీ, కాకినాడ జిల్లా ఆర్యవటంలో 126.25 మి.మీ., పెదపూడిలో 123.69 మి.మీ., ఏలూరు జిల్లా నూతిరామన్నపాలెంలో 122.0 మి.మీ, కాకినాడ జిల్లా కాజులూరులో 121.08 మి.మీ. కరపలో 120.25 మి.మీ, వేళంగిలో 114.01 మి.మీ, జి.మామిడలో 112.75 మి.మీ వర్షపాతం రికార్డయ్యాందని తెలిపారు.

Related News