newsseals.com

నీట్ ప‌రీక్షను ఒప్పుకునేది లేదు : సీఎం విజ‌య్

November 5, 2026 · VijayaBhaskar

చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రోసారి ఆయ‌న త‌మ ప్రభుత్వ వైఖ‌రి ఏమిటో నీట్ పై స్ప‌ష్టం చేశాడు. కేంద్రంలోని బీజేపీ న‌రేంద్ర మోదీ కూట‌మి స‌ర్కార్ కు కోలుకోలేని ఝ‌ల‌క్ ఇచ్చాడు. ఆయ‌న ఎన్నిక‌ల సంద‌ర్బంగా కూడా ఇదే ప్ర‌క‌ట‌న చేశాడు. త‌ను ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉండే వాడిన‌ని నిరూపించాడు. తాజాగా నీట్ ప‌రీక్ష‌కు సంబంధించి కీల‌క మార్పులు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది కేంద్రం. ఇందుకు సంబంధించి నంద‌న్ నీలేక‌నిని నియ‌మించింది. ఈ టాస్క్ ఫోర్స్ బృందం దేశ వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తోంది. ఇందులో భాగంగా త‌మిళ‌నాడు రాష్ట్రంలో ప‌ర్య‌టించింది. స‌చివాల‌యంలో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తో స‌మావేశం అయ్యింది. ఆయ‌న అభిప్రాయాలు, సూచ‌న‌ల‌ను తీసుకుంది.

ఈ సంద‌ర్బంగా తీవ్రంగా స్పందించాడు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. నందన్ నీలేకని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ‘పరీక్షా సంస్కరణల ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్’ సభ్యులకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు.
ఈ సమావేశంలో ఉన్నత విద్యా ప్రవేశాల కోసం నీట్ (NEET) లేదా అటువంటి ఇతర పరీక్షలను నిర్వహించడంపై తమిళనాడు ప్రభుత్వం తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది. దానికి బదులుగా, ప్రవేశాలకు 12వ తరగతి మార్కులను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవాలని బలంగా నొక్కి చెప్పింది. గత ఆగస్టు 11న‌ తమిళనాడు శాసనసభ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిందని గుర్తు చేశారు సీఎం విజ‌య్. అంతే కాకుండా వైద్య కోర్సులు, ఇతర ఉన్నత విద్యా కార్యక్రమాల్లో ప్రవేశాల కోసం నీట్ , అటువంటి ఇతర పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం సిఫార్సు చేసింది.

Related News