ఒకే వేదికపై విజయ్, జగన్, అదానీ వైరల్
చెన్నై : సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. తమిళనాడు రాజధాని చెన్నై వేదికగా జరిగిన వివాహ వేడుకకు ఈ ముగ్గురు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా గత ఎన్నికల కంటే ముందు నుంచే ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజయ్ తో వైఎస్సార్సీపీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తాజాగా వీరు కలుసు కోవడం మరింత ప్రాధాన్యత కలిగింది. అయితే ఇదే వివాహ వేడుక కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ర అట్రాక్షన్ గా మారారు తెలంగాణకు చెందిన మాజీ ఐటీ శాఖ మంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఇక దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ చర్చకు దారితీస్తున్న ఒకే ఒక్కడి పేరు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. ఆయన భారత దేశంలో ప్రస్తుతం టాప్ వ్యాపారవేత్తలలో ఒకడిగా గుర్తింపు పొందారు. అంతే కాకుండా దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ కు, బీజేపీకి అక్షయపాత్రగా మారారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రభుత్వం వచ్చినా తనకే అన్ని టెండర్లు దక్కుతున్నాయి. దీని వెనుక మోదీ మంత్రాంగం, ఒత్తిడి ఉందన్న విమర్శలు లేక పోలేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే అదానీని ఏకి పారేస్తున్నారు. అయితే తన పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి తెలంగాణలో విద్యుత్ మీటర్ల బిగించే కాంట్రాక్టు తనకే అప్పగించడం కలకలం రేపింది. మొత్తంగా నలుగురు దిగ్గజ నాయకులు ఒకే వేదిక ద్వారా కలుసుకోవడం మరింత ఆసక్తిని కలిగించింది. వారిలో కేటీఆర్, జోసెఫ్ విజయ్, జగన్, అదానీ ఉండడం విచిత్రం కదూ.