newsseals.com

నల్గొండను ‘సూపర్ స్మార్ట్ సిటీగా మారుస్తాం

November 6, 2026 · VijayaBhaskar

న‌ల్ల‌గొండ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖా మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం ర‌హ‌దారులు, భ‌వాన‌ల నిర్మాణ‌ల‌పై ఎక్కువ‌గా దృష్టి సారించింద‌న్నారు. ఇందులో భాగంగా న‌ల్ల‌గొండ ఉమ్మ‌డి జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంద‌ని తెలిపారు. ఇదే క్ర‌మంలో నల్గొండను ‘సూపర్ స్మార్ట్ సిటీ’గా మార్చే లక్ష్యంతో తాము అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. జిల్లాలో రూ. 2,000 కోట్ల వ్యయంతో డబుల్ రోడ్ల విస్తరణను, అలాగే పేదల కోసం ‘G+3’ విధానంలో ఇందిరమ్మ గృహాల నిర్మాణాన్ని చేపడుతున్నామని చెప్పారు. రాబోయే ఏడాదిన్నర కాలంలో ప్రతి ఇంటికి 24 గంటల పాటు నిరంతరాయంగా తాగునీటి సరఫరా అందేలా తాము ప్రణాళి కాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు.

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందించాలనే లక్ష్యంతో ప‌ని చేస్తున్న‌ట్లు చెప్పారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఇదిలా ఉండ‌గా తాజాగా నల్గొండలో రూ. 17.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ‘ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయ భవనానికిస‌ , రూ. 10 కోట్ల వ్యయంతో మామిళ్లగూడ మీదుగా కటాల్‌గూడ–రాజీవ్ స్వగృహ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయ‌డం జ‌రిగింద‌న్నారు మంత్రి. నల్గొండ సమగ్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం త‌మ బాధ్య‌త అని స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడం అనే లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నామ‌ని పేర్కొన్నారు.

Related News