NEWSANDHRA PRADESH

బాబు అత్యంత ప్ర‌మాద‌కారి

Share it with your family & friends

ఎంపీ విజ‌య సాయి రెడ్డి
నెల్లూరు జిల్లా – ఎంపీ విజ‌య సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు ను ఏకి పారేశారు. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ భూమి మీద అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తి ఎవ‌రైనా ఉన్నారంటే ఒకే ఒక్క‌డు చంద్ర‌బాబు అని ఎద్దేవా చేశారు.

నిలువెల్లా విషం నింపుకుని చిల్ల‌ర రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న బాబును జ‌నం న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. ఇవాళ దేశంలో ఎక్క‌డా లేని రీతిలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న ఘ‌న‌త జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిద‌ని పేర్కొన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 33కు పైగా కేసుల‌లో నిందితుడిగా ఉన్నాడ‌ని చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. జీవిత కాల‌మంతా జైలులోనే ఉండాల్సిన వ్య‌క్తి వ్య‌వ‌స్థ‌ల‌ను మ్యానేజ్ చేసి, స్టేల మీద బ‌తుకుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు ఎంపీ విజ‌య సాయిరెడ్డి.

ఆయ‌న మాట్లాడితే అబ‌ద్దాలేన‌ని ఎద్దేవా చేశారు. అభివృద్ది పేరుతో కేవ‌లం త‌న సామాజిక వ‌ర్గానికి మాత్ర‌మే వ‌న‌రుల‌ను, ప‌నుల‌ను క‌ట్ట‌బెట్టాడ‌ని ఇంత‌కు మించి ఆయ‌న ఏపీకి చేసింది ఏమీ లేద‌న్నారు ఎంపీ. మొత్తంగా చంద్ర‌బాబు అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తి అని జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు.