అర్ధరాత్రి 12 గంటల సమయంలోనూ హైడ్రా సేవలు

హైద‌రాబాద్ : భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి హైద‌రాబాద్ న‌గ‌రంలో. నిన్న రాత్రి 10.30 గంటల నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. నగర వ్యాప్తంగా వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో హైడ్రా DRF, MRT బృందాల సేవలు నిమ‌గ్నం అయ్యాయి. రహదారుల్లో నిలిచిన వరద నీటిని సాఫీగా పంపుతోంది హైడ్రా. వర్షం ప్రభావాన్ని, క్షేత్ర స్థాయిలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి అధికారులు సూచ‌న‌లు చేశారు.క్షేత్ర స్థాయిలో హైడ్రా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Heavy మోటార్లను పెట్టి నీటిని తోడి వేశారు. ఇందులో కీల‌క పాత్ర పోషించింది హైడ్రా. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని తెలుసుకొని సూచనలు చేశారు హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య .

ఆర్ఎఫ్ఓ జ‌య‌ప్ర‌కాష్‌, డీఎఫ్ఓ శ్రీ‌ధ‌ర్, డీఎఫ్ఓ గౌతం, హైడ్రా ఎస్ఎఫ్ఓ లంతా క్షేత్ర స్థాయిలో ఉండి స‌హాయ‌క చ‌ర్య‌లు ప‌ర్య‌వేక్షించారు. వెనువెంటనే సహాయక చర్యలతో నార్మల్ పరిస్థితులుండేలా జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించారు. మ‌రో వైపు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ నిన్న రాత్రి హుటా హుటిన హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా ప‌ర్య‌టించారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తూ ఉండాల‌ని ఆదేశించారు క‌మిష‌న‌ర్. కురుస్తున్న వ‌ర్షాల‌కు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. వాటిని తొల‌గించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

  • Related Posts

    80 శాతం సబ్సిడీతో1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

    అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో రైతుల పంట‌ల సాగుకు సంబంధించి 80 శాతం స‌బ్సిడీతో 1.31 ల‌క్ష‌ల క్వింటాళ్ల విత్త‌నాల‌ను స‌ర‌ఫ‌రా చేశామ‌ని తెలిపింది. ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళిక కోసం రూ. 60 కోట్లు…

    వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్టుకు ‘సమ్మక్క-సారలమ్మ’ పేరు పెట్టండి

    హైద‌రాబాద్ : ధ‌ర్మ స‌మాజ్ వాది పార్టీ అధ్య‌క్షుడు డాక్టర్ విషార‌ద‌న్ మ‌హారాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి వరంగ‌ల్ ఎయిర్ పోర్టుకు రుద్ర‌మ‌దేవి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *