అత్య‌వ‌స‌ర సేవ‌ల కోసం ‘డ‌య‌ల్ 112’

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు తెలంగాణ పోలీస్ శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్య‌వ‌స‌ర సేవ‌లు పొందేందుకు గాను నూత‌నంగా డ‌య‌ల్ 112 అత్య‌వ‌స‌ర సేవ‌ను ప్రారంభించింది. బుధ‌వారం దీనిని స్టార్ట్ చేశారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్. ఈ సేవ ద్వారా ఒకే ఫోన్ కాల్‌తో 18 రకాల అత్యవసర సేవలను పొందవచ్చని డీజీపీ తెలిపారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ ఈ ‘డయల్ 112’ అత్యవసర స్పందన సేవను ప్రారంభించారు.

అత్యవసర సమయాల్లో వేగవంతమైన, సమన్వయంతో కూడిన స్పందనను అందించేందుకు దీనిని ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు డీజీపీ. అలాగే ప్రజలు ఒకే అత్యవసర నంబర్ ద్వారా కీలక సేవలను సులభంగా పొందేలా చూసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ హెల్ప్‌లైన్ నంబర్ పరిధిలో పోలీసు, అగ్నిమాపక, వైద్య అత్యవసర సేవలు వంటి ముఖ్యమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే 112 అత్య‌వ‌స‌ర సేవ‌ల స‌ర్వీసును అందుబాటులోకి తీసుకు వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు డీజీపీ.

  • Related Posts

    80 శాతం సబ్సిడీతో1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

    అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో రైతుల పంట‌ల సాగుకు సంబంధించి 80 శాతం స‌బ్సిడీతో 1.31 ల‌క్ష‌ల క్వింటాళ్ల విత్త‌నాల‌ను స‌ర‌ఫ‌రా చేశామ‌ని తెలిపింది. ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళిక కోసం రూ. 60 కోట్లు…

    వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్టుకు ‘సమ్మక్క-సారలమ్మ’ పేరు పెట్టండి

    హైద‌రాబాద్ : ధ‌ర్మ స‌మాజ్ వాది పార్టీ అధ్య‌క్షుడు డాక్టర్ విషార‌ద‌న్ మ‌హారాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి వరంగ‌ల్ ఎయిర్ పోర్టుకు రుద్ర‌మ‌దేవి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *