కాగిత రహిత పాలన దిశగా అడుగులు

హైద‌రాబాద్ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. పాలనలో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ , డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఏఐ ట్రాన్స్‌ఫార్మేషన్ కాంక్లేవ్ లో ఆయన మాట్లాడారు. కాగిత రహిత ఈ-గవర్నెన్స్ లక్ష్యంతో శాసనసభ , శాసనమండలి కార్యకలాపాలలో డిజిటలైజేషన్‌ను భారీగా ప్రోత్సహించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ‘డిజిటల్ ఆఫీస్’ ప్రాజెక్ట్ కాగిత రహిత పాలనను వేగవంతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. పాలనలో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ , డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు. ‘రియల్-టైమ్ గవర్నమెంట్ డాష్‌బోర్డ్’ 20కి పైగా ప్రభుత్వ శాఖలను ఒకే వేదికపై అనుసంధానిస్తుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అయిన టి – ఫైబ‌ర్ ద్వారా 80 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ కనెక్టివిటీని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు. వృద్ధులు , దివ్యాంగుల కోసం ఇంటి వద్దకే సేవలు అందించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. బ్లాక్‌చెయిన్ ఆధారిత ధృవీకరణ పత్రాల సేవలను కూడా త్వరలో ప్రవేశ పెడతామని మంత్రి తెలిపారు. కాగిత రహిత పాలనలో భాగంగా ఈ ఏడాది జూన్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం కాగిత రహిత మంత్రివర్గ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిందని ప్ర‌క‌టించారు శ్రీ‌ధ‌ర్ బాబు. జూన్ 18న సచివాలయంలో జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో ప్రత్యేక ట్యాబ్‌లను అందజేశామ‌న్నారు.

  • Related Posts

    సోనియా గాంధీ కేసు మెజిస్ట్రేట్ కు అప్ప‌గించిన కోర్టు

    న్యూఢిల్లీ : ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఓటర్ల జాబితా కేసును తిరిగి మేజిస్ట్రేట్‌కు అప్పగించంది ఢిల్లీ కోర్టు. మేజిస్ట్రేట్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులో తగిన కారణాలు లేవని పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కొత్తగా…

    డీఎస్సీ స్కాంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాలి

    విజ‌య‌వాడ : డీఎస్సీ స్కాంపై CBI విచారణ జరపాలని, లోకేష్ రాజీనామా చేయాలని YSRCP డిమాండ్ చేసింది. కుంభకోణం వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసేందుకు నిష్పాక్షికమైన విచారణ జరపాలని , ఇందుకు బాధ్య‌త వ‌హిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *