బెంగళూరు : ప్రముఖ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి కేంద్ర సర్కార్ పై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాలపై భగ్గుమన్నారు. తాజాగా తన ఓటు హక్కుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంత కాలంగా ప్రకాష్ రాజ్ తన వాయిస్ ను పెంచారు. కేంద్రం ఆధ్వర్యంలో తీసుకు వచ్చిన పలు నిర్ణయాలను బహిరంగంగానే విమర్శిస్తూ వచ్చారు. ఆపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఇదే క్రమంలో దేశంలో ప్రజాస్వామ్యం రోజు రోజుకు క్షీణిస్తోందని ఆవేదన చెందారు.
ఇదే క్రమంలో దేశంలో మతం పేరుతో, కులం పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతూ మనుషులను విడదీస్తున్న బీజేపీ, దాని హిందూత్వ సంస్థలను ఏకి పారేశారు. ఇదే క్రమంలో సర్ పేరుతో కీలకమైన ఓ వర్గానికి చెందిన వారి ఓట్లను లేకుండా చేయడం పట్ల అభ్యంతరం తెలిపారు. ఇదే క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో తనకు ఓటు హక్కు అనేది లేక పోవడాన్ని తప్పు పట్టారు. తనకు రెండు చోట్ల ఓటు ఉందనే కారణంగా ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. ఈ సందర్భంగా కేంద్రాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మీరు తన ఓటును తొలగించరేమో కానీ తాను అంతకంటే ఎక్కువగా ఓటర్లను ప్రభావితం చేయగలనని పేర్కొన్నారు.








