వైట్ హౌస్ కార్య‌ద‌ర్శి క‌రోలిన్ లీవిట్ షాకింగ్ కామెంట్స్

అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ తీవ్రతరం కావడం

అమెరికా : అమెరికాలో ఏం జ‌రుగుతోంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. దేశాధ్య‌క్షుడు తీసుకుంటున్న కీల‌క నిర్ణ‌యాలు ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. మ‌రో వైపు నిధుల గడువును దాట వేయడంతో ఫెడరల్ ప్రభుత్వం పాక్షికంగా షట్‌డౌన్‌లోకి జారుకుంది. అనేక ఏజెన్సీలకు బడ్జెట్ లేకుండా పోయింది. ఇందుకు సంబఃధించి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మాట్లాడారు. ఇందుకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇలాగే షట్‌డౌన్ కొనసాగితే వేల మంది ఫెడరల్ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందంటూ హెచ్చ‌రించారు. దీంతో ఆమె చేసిన ఈ తాజా ప్ర‌క‌ట‌న
వాషింగ్టన్‌లో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలకు తోడ్పడింది.

పరిపాలన అధికారులు ఇప్పటికే సాధ్యమైన తొలగింపులకు సిద్ధమవుతున్నారని అన్నారు. ఇది వేలల్లో ఉండే అవకాశం ఉందంటూ పేర్కొన్నారు. ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ , ఇతర అధికారులు ఏ విభాగాలను ప్రభావితం చేయవచ్చో చురుకుగా చర్చిస్తున్నారని స‌మాచారం. ఇందుకు గాను లీవిట్ పూర్తిగా డెమొక్రాట్లపై నింద మోపింది, నిధుల ఒప్పందంపై సహకరించడానికి వారు నిరాకరిస్తున్నారని ఆరోపించింది. డెమొక్రాట్లు ప్రభుత్వాన్ని తెరిచి ఉంచడానికి ఓటు వేసి ఉంటే ఈ సంభాషణలు జరిగేవి కావు అని ఆమె ఆరోపించారు. డెమొక్రాట్లు సంక్షోభంతో రాజకీయాలు ఆడుతున్నారని మండిప‌డింది.
పత్రాలు లేని వలసదారులకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలపై భిన్నాభిప్రాయాలను ఒక అడ్డంకిగా చూపింది. బైడెన్ పరిపాలన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పది వేల మంది అక్రమ వలసదారులను దేశంలోకి వచ్చి ఉచిత ప్రయోజనాలను పొందడానికి అనుమతించిందని ఆరోపించింది.

  • Related Posts

    ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోతే ఎలా..?

    ఏపీ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న మాజీ సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తి : పిల్ల‌ల ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఏపీ స‌ర్కార్ పాల‌న‌ను గాలికి వ‌దిలి వేసింద‌న్నారు. పేదల తలరాతను…

    భ‌క్త క‌న‌క‌దాస‌ను స్పూర్తిగా తీసుకోవాలి

    పిలుపునిచ్చిన మంత్రి ఎస్. స‌విత‌ తిరుప‌తి : సాధువు, యోగి భ‌క్త క‌న‌క‌దాసును స్పూర్తిగా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు మంత్రి ఎస్. స‌విత‌. తిరుప‌తి ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన భ‌క్త క‌న‌క‌దాసు విగ్ర‌హాన్ని ఆమె ఆవిష్క‌రించారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. రాష్ట్రంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *