వేగంగా వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు

అమ‌రావ‌తి : అమరావతిలోని వేంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ పనులను టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ పరిశీలించారు. 2వ ప్రాకారం, నాలుగు గాలి గోపురాల పనుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆలయంలోని 2వ ప్రాకారం, నాలుగు గాలి గోపురాల నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని సూచించారు.

పనుల సందర్భంగా ఎదురయ్యే సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకు రావాలని ఆదేశించారు. నిర్మాణానికి సంబంధించి నిధుల కొర‌త లేద‌ని స్ప‌ష్టం చేశారు. త్వ‌రిత‌గ‌తిన ప‌నులు పూర్తి చేసి ఆల‌యానికి భ‌క్తులు వ‌చ్చేలా చూడాల‌న్నారు. ప‌నులను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించాల‌ని, ఏ మాత్రం తేడా వ‌చ్చినా చూస్తూ ఊరుకునేది లేద‌న్నారు. జేఈవో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఈ సురేంద్ర, సూపరింటెండెంట్ మల్లికార్జున, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    సెప్టెంబర్ లో తిరుమలలో విశేష పర్వదినాలు

    తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ( టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు వెల్ల‌డించింది. ఈ విశేష ప‌ర్వ‌దినాల సంద‌ర్బంగా వివిధ ప్రాంతాల నుంచి శ్ర‌మ‌కోర్చి శ్రీ వేంక‌టేశ్వ‌ర…

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

    తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *