చేనేత‌ల‌కు చెల్లింపుల‌పై మంత్రి స‌విత ఫోక‌స్

అమ‌రావ‌తి : రాష్ట్ర చేనేత శాఖ మంత్రి ఎస్. స‌విత చేనేత రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించారు. మంత్రి ఆదేశాల మేరకు చేనేత, జౌళి శాఖాధికారులు రాష్ట్రంలోని వివిధ చేనేత సహకార సంఘాలకు రూ.1,03,38,678లను చెల్లించారు. వివిధ శాఖలు, గురుకులాల పాఠశాలలకు సరఫరా చేసిన చేనేత లివరీ వస్త్రాలకు సంబంధించి ఈ చెల్లింపులు ఉన్నాయి. 20 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆ చెల్లింపులను జమ చేశారు. త్వరలో మిగిలిన బకాయిలను కూడా చెల్లించేలా చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ దిశా నిర్దేశంలో చేనేత సహకార సంఘాలకు సకాలంలో చెల్లింపులు జరిగేలా రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ప్రత్యేక దృష్టి సారించారు.

చేనేత సహకార సంఘాల ఆర్థిక బలోపేతంలో భాగంగా ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోళ్లు జరిగేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నేటి తరం అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఏయే వస్త్రాలు కావాలో ఆయా సంఘాలకు ఆప్కో ద్వారా ఆర్డర్లు అందజేస్తున్నారు. అదే సమయంలో ఆయా సంఘాల నేతలతోనూ సమావేశమై వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వస్త్రాలు తయారు చేయాలని సూచిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా వాటికి తక్షణ చెల్లింపులు చేసేలా ఆప్కో అధికారులతో మంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆప్కో చరిత్రలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత బకాయిల్లేకుండా మంత్రి సవిత తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి

  • Related Posts

    సమాచార శాఖ అదనపు సంచాలకుడిగా డి.ఎస్. జగన్

    హైదరాబాద్ :సమాచార, పౌర సంబంధాల శాఖలో డి.ఎస్. జగన్ అదనపు సంచాలకుడిగా (Additional Director) పదోన్నతి పొందారు. పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. డి.ఎస్. జగన్ డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర…

    మెట్టూరు ఆన‌క‌ట్ట నుండి నీటిని విడుద‌ల చేసిన సీఎం

    చెన్నై : తమిళనాడు ముఖ్య‌మంత్రి తిరు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ మంగ‌ళవారం కావేరి డెల్టా జిల్లాలో ప‌ర్య‌టించారు. ‘వరి గిన్నె’గా ప్రసిద్ధి చెందిన కావేరీ డెల్టా జిల్లాల్లో ‘సాంబా’ పంట సాగుకు, కావేరీ పరీవాహక ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చడానికి సేలం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *