శ్రీ గోవింద‌రాజ స్వామి ఆల‌యంలో విశేష ఉత్స‌వాలు

తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ( టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ సెప్టెంబర్ నెల‌లో టీటీడీ ఆధ్వ‌ర్యంలో తిరుప‌తి లోని శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆల‌యంలో విశేష ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు వివిధ ప్రాంతాల నుంచి శ్ర‌మ‌కోర్చి స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చే భ‌క్తులు గ‌మ‌నించాల‌ని, అందుకు అనుగుణంగా త‌మ ప్ర‌ణాళిక త‌యారు చేసుకోవాల‌ని సూచించింది. ఇదిలా ఉండ‌గా శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆల‌యంలో సెప్టెంబరు నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు జ‌రుగనున్నాయి.

సెప్టెంబరు 4న గోకులాష్టమి సంద‌ర్భంగా సాయంత్రం శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, అనంతరం బంగారు వాకిలి చెంత పురాణ ప్రవచనం, గోకులాష్టమి ఆస్థానం నిర్వ‌హిస్తార‌ని తెలిపింది టీటీడీ. 7న చిన్న వీధి ఉట్లోత్స‌వం, ఆగ‌స్టు 8న పెద్ద వీధి ఉట్లోత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.12న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయ నాంచారులతో కలిసి శ్రీ గోవింద రాజ స్వామి వారు భక్తులకు ద‌ర్వ‌నం ఇవ్వ‌నున్నారు. 21న శ్రీ గోవింద రాజస్వామివారి అలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ జ‌రుగుతుంద‌ని తెలిపింది టీటీడీ. 22 నుండి 24వ తేదీ వరకు ఉంటాయ‌ని పేర్కొంది.
26న పౌర్ణమి సందర్భంగా శ్రీ గోవిందరాజ స్వామివారి గరుడ సేవ నిర్వ‌హిస్తార‌ని వెల్ల‌డించింది.

  • Related Posts

    రెండు వారాల్లో శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

    తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనుల పురోగతిపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని సుధర్మ…

    సెప్టెంబర్ లో తిరుమలలో విశేష పర్వదినాలు

    తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ( టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు వెల్ల‌డించింది. ఈ విశేష ప‌ర్వ‌దినాల సంద‌ర్బంగా వివిధ ప్రాంతాల నుంచి శ్ర‌మ‌కోర్చి శ్రీ వేంక‌టేశ్వ‌ర…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *