హైదరాబాద్ : తెలంగాణ శాసన సభ , శాసన మండలి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల బ్యాడ్జీలు, దుస్తులు ధరించి హాజరయ్యారు. వీరిని పోలీసులు , భద్రతా సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది అసెంబ్లీ ముందు. అంతకు ముందు గన్ పార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పాలన పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు.
ఆయన కేవలం బనియన్ తో హాజరు కావడం , తన అనుమతి లేకుండానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేటీఆర్, హరీష్ రావులను తెలంగాణ భవన్ కు బలవంతంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ప్రాంగంణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమను ఇలా బలవంతంగా అదుపులోకి తీసుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు హరీష్ రావు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో నెరవేరని హామీల అంశాన్ని లేవనెత్తాలని బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు పార్టీ నాయకులను ఆదేశించారని ఆయన తెలిపారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఎన్ని రకాలుగా అవమానించినప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు హరీష్ రావు.






