స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

హైద‌రాబాద్ : బంగారం, వెండి కొనుగోలుదారుల‌కు కొంచెం ఉప‌శమ‌నం క‌లిగించేలా చేసింది సోమ‌వారం.
గ‌త కొన్ని రోజుల నుంచి ప‌సిడి, వెండి ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో కొనుగోలు చేయాలంటేనే జ‌డుసుకునే ప‌రిస్థితి నెల‌కొంది. కానీ శ్రావ‌ణ మాసం కావ‌డం, అంత‌ర్జాతీయ మార్కెట్ లో చోటు చేసుకుంటున్న ఒడిదుడుకుల కార‌ణంగా బంగారం, వెండి ధ‌ర‌లు అటూ ఇటూ కొన‌సాగుతున్నాయి. ఇక ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బంగారం ధర రూ. 462, వెండి ధర రూ. 975 మేర తగ్గుదల క‌నిపించింది. తక్షణ మార్కెట్‌లో (స్పాట్ మార్కెట్) డిమాండ్ బలహీనంగా ఉండటం , మార్కెట్ భాగస్వాముల అమ్మకాల ఒత్తిడి కారణంగా విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి.

ఇవాళ‌ జరిగిన ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 462 తగ్గి రూ. 1,52,305కి చేరగా, వెండి ధర కిలోకు రూ. 975 తగ్గి రూ. 2,36,683కి పడిపోయింది. అక్టోబర్ నెలవారీ బంగారం కాంట్రాక్టులు 1,390 లాట్ల టర్నోవర్‌తో 0.3 శాతం తగ్గగా, డిసెంబర్ నెలవారీ వెండి కాంట్రాక్టులు 1,512 లాట్ల టర్నోవర్‌తో 0.41 శాతం తగ్గాయి. అంతర్జాతీయంగా చూస్తే న్యూయార్క్‌లో బంగారం ఫ్యూచర్స్ 0.84 శాతం తగ్గి ఔన్స్‌కు 4,492.68 డాలర్లకు చేరగా, వెండి 0.63 శాతం తగ్గి ఔన్స్‌కు 65.79 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. ఊహించిన దానికంటే మెరుగైన ఉపాధి గణాంకాలు వెలువడటంత అమెరికాలో వడ్డీ రేట్లు పెరగ వచ్చన్న అంచనాలు కూడా విలువైన లోహాలపై ఇటీవలి మార్కెట్ ఒత్తిడికి కారణంగా నిలిచాయి.

  • Related Posts

    జియో వినియోగదారుల‌కు రూ. 3,599 వార్షిక ప్లాన్

    హైద‌రాబాద్ : రిల‌య‌న్స్ జియో త‌మ క‌ష్ట‌మ‌ర్ల కోసం కొత్త‌గా రూ. 3,599తో వార్షిక ప్లాన్ ప్ర‌క‌టించింది.Jio తన ప్రారంభోత్సవం తర్వాత పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. రూ. 3,599 వార్షిక…

    టీసీఎస్ హైప‌ర్ వాల్ట్ తో తెలంగాణ స‌ర్కార్ ఒప్పందం

    హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు టీసీఎస్–హైపర్‌వాల్ట్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. రూ.70 వేల కోట్ల పెట్టుబడి.. 7 వేల ఉద్యోగాలు..…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *