టీసీఎస్ హైప‌ర్ వాల్ట్ తో తెలంగాణ స‌ర్కార్ ఒప్పందం

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు టీసీఎస్–హైపర్‌వాల్ట్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. రూ.70 వేల కోట్ల పెట్టుబడి.. 7 వేల ఉద్యోగాలు.. 250 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యంతో ప్రపంచస్థాయి AI మౌలిక వసతులు ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. AI విప్లవంలో హైదరాబాద్‌ను ప్రపంచానికి నాయకత్వం వహించే నగరంగా నిలపాలన్న మా సంకల్పానికి ఇది మరో చారిత్రాత్మక ముందడుగుగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

ఫ్యూచర్ సిటీపై మనం కన్న కలకు ఈ ప్రాజెక్టు బలమైన పునాది కానుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు సీఎం. తెలంగాణ రైజింగ్ విజన్–2047లో భాగంగా తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన, భవిష్యత్ సాంకేతికతకు కేంద్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తెలంగాణపై నమ్మకంతో ఇంత భారీ పెట్టుబడికి ముందుకొచ్చిన టీసీఎస్–హైపర్‌వాల్ట్‌ ప్రతినిధులకు నా అభినందనలు తెలిపారు. ఇది కేవలం పెట్టుబడి కాదు.. తెలంగాణ భవిష్యత్తుపై ప్రపంచం ఉంచిన నమ్మకం అని పేర్కొన్నారు.

  • Related Posts

    ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో పెరిగిన బంగారం, వెండి ధ‌ర

    హైద‌రాబాద్ : ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బంగారం ధర రూ. 1,029, వెండి ధర రూ. 1,862 పెరిగాయి . కొత్తగా తీసుకున్న పొజిషన్లు , స్పాట్ మార్కెట్‌లో బలమైన డిమాండ్ కారణంగా విలువైన లోహాల ధరలు పెరిగాయి. గురువారం జరిగిన ఫ్యూచర్స్…

    డాల‌ర్ ప్ర‌భావం భార‌తీయ రూపాయి బ‌ల‌హీనం

    ముంబై : అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తడం చమురు ధరలు పెరగడం, ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం వంటి కారణాల నేపథ్యంలో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 2 పైసలు పడిపోయి, స్వల్ప పరిధిలో ట్రేడయింది. 94.97…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *