వ‌రుస సెల‌వులు శ్రీ‌శైలంలో పోటెత్తిన భ‌క్తులు

నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లా లోని ప్ర‌ముఖ శైవ క్షేత్రం శ్రీ‌శైలం దేవాల‌యానికి భ‌క్తులు పోటెత్తారు. వ‌రుస‌గా సెల‌వులు రావ‌డంతో ఆల‌యంలో కొలువు తీరిన శ్రీ భ్ర‌మ‌రాంబికా మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శ‌నం చేసుకునేందుకు బారులు తీరారు. వీరిని నియంత్రించ‌డం ఒకానొక ద‌శ‌లో పోలీసుల‌కు క‌ష్ట‌త‌రంగా మారింది. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఆలయ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భారీ రద్దీ కారణంగా భక్తులు దర్శనం కోసం సుమారు రెండు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.

ఆలయ ప్రాంగణం , పరిసర ప్రాంతాలు భక్తులతో నిండి పోయాయి. క్యూ లైన్లను క్రమబద్ధీకరించడానికి , భక్తుల రాకపోకలు సజావుగా సాగేలా చూడటానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆలయ అధికారులు అభిషేకం , కుంకుమార్చన పూజలను నిలిపి వేశారు. వరుస సెలవుల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా పొరుగు ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలి వస్తుండటంతో ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని ఈవో వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీ, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, త‌దిత‌ర ప్రాంతాల నుంచి మ‌ల్ల‌న్న కోసం తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు. స్వామిని ద‌ర్శ‌నం చేసుకుంటే , అభిషేకం చేస్తే ఇబ్బందులు తొల‌గి పోతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం.

  • Related Posts

    గ‌ణేశ్ ఉత్స‌వాలకు భారీ భ‌ద్ర‌త క‌ల్పించాలి

    అమరావ‌తి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమ‌వారం నుంచి వినాయ‌క మండపాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఇవాళ ఆయా జిల్లాల ఎస్పీల‌తో హోం శాఖ మంత్రి టెలి కాన్ఫ‌రెన్స్…

    సీఎం చంద్ర‌బాబుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

    తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ( టీటీడీ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి ముద్దాడ ర‌విచంద్ర‌తో పాటు ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు, టీటీడీ బోర్డు స‌భ్యులు , ఆల‌య అర్చ‌కులు శ‌నివారం అమ‌రావ‌తి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *