ఈషా రెబ్బా త‌రుణ్ భాస్క‌ర్ నెట్టింట్లో వైర‌ల్

హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్, న‌టి ఈషా రెబ్బ‌ల మ‌ధ్య రిలేష‌న్ షిప్ పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి వినాయ‌క చ‌వితి పండుగ సంద‌ర్భంగా ఈ ఇద్ద‌రూ క‌లిసి పూజ‌లు చేయ‌డం , ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను స్వ‌యంగా న‌టి, ద‌ర్శ‌కుడు త‌మ త‌మ సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేయ‌డం, అవి కాస్తా వైర‌ల్ గా మార‌డంతో ఈ ఇద్ద‌రూ త్వ‌ర‌లోనే ఒక్క‌టి కాబోతున్న‌ట్లు టాక్. మొత్తం మీద త‌రుణ్ భాస్క‌ర్, ఈషా రెబ్బా హాట్ టాపిక్ గా మార‌డం, ఎలాంటి ఖ‌ర్చు లేకుండానే పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో ఇద్ద‌రూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమా షూటింగ్ సమయంలో తరుణ్ భాస్క‌ర్ , ఈషా రెబ్బాల మధ్య ప్రేమ చిగురించిందనే వార్తలు గతంలోనే వినిపించాయి. అంతేకాదు, ఈషా తనకు కేవలం స్నేహితురాలు అంతకు మించినద‌ని త‌రుణ్ భాస్క‌ర్ పేర్కొనడం, ఆయ‌న చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మార‌డం గ‌తంలో చోటు చేసుకుంది. తాజాగా షేర్ చేసిన ఫొటోతో వీరి రిలేషన్‌పై మరోసారి జోరుగా చర్చ జరుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రూ ఒక్క‌టి కాబోతున్న‌ట్లు టాక్. విచిత్రం ఏమిటంటే త‌రుణ్ భాస్క‌ర్, ఈషా రెబ్బా లు ఇద్ద‌రూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కావ‌డం విశేషం.

  • Related Posts

    జైల‌ర్ -2లో ర‌జ‌నీకాంత్ పారితోష‌కం రూ.125 కోట్లు..?

    చెన్నై : త‌మిళ నాట సెన్సేష‌న్ త‌లైవా ర‌జ‌నీకాంత్. ఆయ‌న ఏది చేసినా ఓ సంచ‌ల‌న‌మే. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో జైల‌ర్ లో న‌టించారు. ఇది ఊహించ‌ని రీతిలో భారీ స‌క్సెస్ న‌మోదు చేసింది. అంతే కాకుండా ర‌జ‌నీకాంత్ సినీ…

    సెప్టెంబ‌ర్ 25 నుండి జీ5లో య‌ష్ టాక్సిక్

    హైద‌రాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరో యశ్ కీ రోల్ పోషించిన చిత్రం టాక్సిక్ . దీనికి గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ మూవీ. కానీ మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. భారీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *