వినాయ‌కుడి చ‌ల్ల‌ని దీవెనలు ఏపీపై ఉండాలి

అనంత‌పురం జిల్లా : వినాయ‌క చ‌వితి పండుగ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. అనంతపురం ప‌ట్ట‌ణంలోని త‌మ‌ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి సందర్భంగా గణపతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఆ విఘ్నేశ్వరుని దైవిక ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లోని ఆటంకాలు తొలగిపోయి ఆనందం, సంతోషం , విజయాలు వర్ధిల్లాలని ప్రార్థించ‌డం జ‌రిగింద‌న్నారు బండారు శ్రావ‌ణి శ్రీ‌.

అదేవిధంగా సరైన సమయంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతుల జీవితాల్లో ఆనంద సౌభాగ్యాలు వికసించాలని ఆ గణపతిని వేడుకున్నామని పేర్కొన్నారు ఎమ్మెల్యే.రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితం సంతోషం, శాంతి , క్షేమంతో నిండాలని కోరుకుంటున్నానని అన్నారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు . ప్ర‌త్యేకించి ఏపీని ఆధ్యాత్మిక , ప‌ర్యాట‌క రంగాల‌లో అగ్ర‌గామిగా నిల‌బెట్టేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.

  • Related Posts

    సీఎం చంద్ర‌బాబు నివాసంలో వినాయ‌క చ‌వితి

    మంగ‌ళ‌గిరి : ఏపీలోని మంగ‌ళ‌గిరిలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నివాసంలో సోమవారం వినాయ‌క చ‌వితి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఘ‌నంగా పూజ‌లు చేప‌ట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి భక్తిపూర్వకంగా విఘ్నేశ్వరుడిని పూజించారు. కుటుంబ సమేతంగా జరిపిన ఈ గణనాథుని పూజ ఎంతో…

    ఖైరతాబాద్ వినాయకుడి మాదిరిగా ‘డూండీ’ గణపతి

    విజయవాడ : ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలకు మాదిరిగా డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏపీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. సంప్రదాయాలను పాటిస్తూ పర్యావరణానికి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *