టీచ‌ర్ల‌పై దాడి ప్రజాస్వామ్యానికి మచ్చ : బోండా ఉమ‌

విజ‌య‌వాడ : ప్ర‌భుత్వ విప్ బోండా ఉమామహేశ్వ‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కూట‌మి పాల‌న‌ను అస్థిర ప‌రిచేందుకు వైసీపీ ఆధ్వ‌ర్యంలో కుట్ర‌ల‌కు తెర లేపార‌ని మండిప‌డ్డారు. లా అండ్ ఆర్డ‌ర్ కు భంగం క‌లిగిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు. స్వార్ధ రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ కోసం ప్రజల పై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం పాపాలు, అవినీతి ఒక్కొక్కటిగా ఆధారాలతో బయటకు వస్తుండటం ఓర్వలేక రాక్షస క్రీడకు పాల్పడుతున్నారని మండిప‌డ్డారు. ప్ర‌శాంతంగా ఉన్న విజయవాడ నగరాన్ని రావణకాష్టం చేయాలని అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు. నిన్న మా నాయకుడు మా చేతులు కట్టేయకుంటే ఒక్క వైసీపీ నేత తిరిగి వెళ్ళేవాళ్లు కాదన్నారు.

వైసీపీ వికృత చేష్టలకు మాతో పాటు, ప్రజాల్లోనూ సహనం నసిస్తోందని అన్నారు బోండా ఉమామ‌హేశ్వ‌ర్ రావు. కోడిగుడ్లు, మారణాయుధాలతో ప్రధాన రహదారిపై వైసీపీ గూండాలు వస్తే పోలీసులు సైతం ప్రేక్షకపాత్ర పోషించటం దురదృష్టం అన్నారు. రౌడీషీటర్లు అంతా నిన్న విజయవాడ శాప్ కార్యాలయం మీద దాడికి వచ్చారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిన్న వచ్చిన వైసీపీ నేతలందరిపైనా పోలీసులు కేసులు పెట్టి అరెస్టు చేయాల్సిందేన‌ని అన్నారు. పోలీసులు ఇంకా మీనమేషాలు లెక్కిస్తే విజయవాడ అరాచకం అవుతుందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ప్ర‌భుత్వ విప్. ఇది అమరావతి బ్రాండ్ ఇమేజ్ కు కూడా ఇబ్బందేన‌ని పేర్కొన్నారు. పోలీసులు ఉక్కుపాదం మోపకుంటే అమరావతి ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని అన్నారు.

  • Related Posts

    సోనియా గాంధీ కేసు మెజిస్ట్రేట్ కు అప్ప‌గించిన కోర్టు

    న్యూఢిల్లీ : ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఓటర్ల జాబితా కేసును తిరిగి మేజిస్ట్రేట్‌కు అప్పగించంది ఢిల్లీ కోర్టు. మేజిస్ట్రేట్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులో తగిన కారణాలు లేవని పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కొత్తగా…

    డీఎస్సీ స్కాంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాలి

    విజ‌య‌వాడ : డీఎస్సీ స్కాంపై CBI విచారణ జరపాలని, లోకేష్ రాజీనామా చేయాలని YSRCP డిమాండ్ చేసింది. కుంభకోణం వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసేందుకు నిష్పాక్షికమైన విచారణ జరపాలని , ఇందుకు బాధ్య‌త వ‌హిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *