శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్స‌వాలు

వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమ‌ల ఆల‌య ప‌రిధిలోని ఆల‌యాల‌లో అక్టోబ‌ర్ నెల‌లో నిర్వ‌హించే ఉత్స‌వాల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఇందులో భాగంగా అక్టోబర్ 10, 17, 31వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. 7న పౌర్ణమి గరుడ సేవ ఉంటుంది. అక్టోబర్ 11న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

అంతే కాకుండా అక్టోబర్ 15 నుండి 24వ తేదీ వరకు శ్రీ తిరుమల నంబి ఉత్సవం, శాత్తుమొరై ఉంటుంది.
16న దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేప‌డ‌తారు. 18 నుండి 27వ తేదీ వరకు శ్రీ మానవుల మహాముని ఉత్సవం ఉంటుంది. 19న నరక చతుర్దశి, ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయ నాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజ స్వామివారు భక్తులకు ద‌ర్శనం ఇవ్వ‌నున్నారు . 20న దీపావళి ఆస్థానం నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.

  • Related Posts

    అంగ‌రంగ వైభ‌వంగా ప‌విత్రోత్స‌వాలు

    శ్రీ‌ప‌ట్టాభిరామ స్వామివారి ఆల‌యంలో తిరుపతి : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం…

    వయో వృద్ధుల దర్శనం పై పుకార్లు నమ్మొద్దు

    స్ప‌ష్టం చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి పాల‌క మండ‌లి (టీటీడీ) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వయో వృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *